About Me

My photo
శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుoదరి పేరుతో బాల సాహితీవేత్తగా మీ అ౦దరికీ నేను పరిచయమే! నేను వెలువరిoచిన ముoగిటిముత్యాలు బాలల గేయ కావ్యo తెలుగుభాషోద్యమ కోణoలోoచి చేసిన ప్రసిధ్ధ రచన.ఇప్పటివరకూ 116 మహర్షుల చరిత్రలు,అవతారాల కథలు,అనే పరిశోధనాత్మక రచనలు,యోగి వేమన జీవిత చరిత్ర,బoగారుకలలు,కొత్తబ౦గారులోక౦ వ౦టి 15 పుస్తకాలు వెలువడ్డాయి. కృష్ణాజిల్లారచయితలసoఘo ద్వారా అనేక జాతీయసదస్సులకు నిర్వహణా బాధ్యతలు చేపట్టాను.తానా,అమెరికా వారి ఆధ్వర్యoలో జరిగిన సదస్సులో తెలుగువారి పoడుగలపైన నా పరిశోధనాపత్రo ప్రశoసలు పొoదిoది. 2010లో వoగూరు ఫౌoడేషన్ వారి అoతర్జాతీయ రచయిత్రుల మహాసభలలో బాలసాహిత్యమూ-రచయిత్రుల పాత్ర,.శ్రీ శ్రీ బాలసాహిత్యo వ౦టి పరిశోధనా పత్రాలు పలువురి ప్రశoసలు పొoదాయి. బoదరు డచ్ కోటలో జరిగిన కృష్ణాజిల్లా చారిత్రక వైభవo సదస్సులో కృష్ణాజిల్లా టెలీకమ్యూనికేషన్స్ పైన ప్రత్యేక ప్రసoగo చేశాను. నా కథలు, కవితలు , శీర్షికలు, సీరియల్సూ వివిథ వార, మాస పత్రికలలో నిర్విరామoగా వస్తున్నాయి.కనకదుర్గ ప్రభ,భక్తిసుధ,చిత్సుధ మొదలైన ఆధ్యాత్మిక పత్రికలలో కూడా తరచూ కనిపిస్తూ ఉoటాయి.ఉయ్యూరు సరసభారతి వారు,కైకలూరు సాహితీ మిత్రులు ఉగాది ఉత్తమ కవయిత్రి పురస్కారాన్ని అoదిoచి గౌరవిoచారు.విజయవాడ సిధ్ధార్థ మహిళా కళాశాల వారు నన్ను సత్కరిoచారు.వృత్తి రీత్యా విజయవాడ బిఎస్ఎన్ఎల్ లో సీనియర్ సూపర్ వైజర్ గా పనిచేస్తున్నాను.

మన ఆరోగ్యం మే నెల 2018 మాసపత్రికకి
రంజాన్ మాసం
   ముస్లింలకి అత్యంత పవిత్ర రంజాన్‌ మాసం ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యమున్న మాసం. ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది. మహ్మద్‌ ప్రవక్త హజరత్‌ రసూల్‌ ఇల్లల్లాహి మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతోంది.
  ఈ మాసంలో రోజుకు ఐదు పర్యాయాలు నమాజ్‌తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఈ పవిత్ర మాసంలో దానధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుతారని, నరకపు ద్వారాలు మూసి ఉంటాయని ముస్లింల నమ్మకం.
ఉపవాస దీక్షలు
   రంజాన్‌ మాసం ఉపవాస దీక్షలు ప్రారంభమవుతాయి. ఈ మాసంలో ముస్లింలు తెల్లవారు జామున నాలుగు గంటలకే ఆహారం తీసుకుంటారు. అనంతరం సూర్యాస్తమయం వరకు నీరు, ఆహారం, కనీసం ఎంగిలి కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు.
  వయస్సులో తారతమ్యం లేకుండా చిన్న, పెద్ద, ముసలి వారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో ఉంటారు. ఉపవాస దీక్షలతో బలహీనతలు, వ్యసనాలను జయించవచ్చని ఇస్లాం మత గురువులు చెబుతారు. ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటారని శాస్త్రం చెబుతుంది. ఉపవాస దీక్షలు (రోజా)సహారీతో ప్రారంభమై ఇఫ్తార్‌తో ముగుస్తాయి.
ఇఫ్తార్‌ విందులు
  ఖర్జూరపు పండుతిని దీక్ష విరమించే ముస్లింలు దీక్ష విరమించాక వివిధ రకాలైన రుచికరమైన వంటకాలను భుజిస్తారు. పలు ప్రాంతాల్లో ఉపవాస దీక్షను ఉప్పుతో కూడా విరమిస్తారు. ఈ వంటకాలతో పాటు సంప్రదాయ వంట హలీమ్‌ను తయారు చేసే హోటళ్ళు ఈ నెలంతా కొనుగోలుదారులతో బిజీబిజీగా ఉంటాయి. 
సుర్మాతో కళ్లకు కొత్త అందం
    కళ్లకు సుర్మాపెట్టుకోవడం కూడా ముస్లింలు సున్నత్‌ గానే భావిస్తారు. ప్రవక్త హజరత్‌ మహ్మద్‌ సదా సుర్మా పెట్టుకునేవారని అంటారు. కళ్లకు రాసుకునే సుర్మా పౌడరు రూపంలో కాటుకలాగే ఉంటుంది. ముస్లింలు అందమైన భరిణెల్లో వీటిని దాచుకొని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టు కోవడానికి కూడా ఇవ్వడం సంప్రదాయం. ప్రతి నమాజుకు ముందు సంప్రదాయం ప్రకారం ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు.
నమాజ్‌ విశిష్టత
  ప్రతి మాసంలోను శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్‌ చేయడం పరిపాటి. ఇక రంజాన్‌ మాసంలో మత పెద్దలతో నమాజ్‌ చేయించడం ప్రశస్తమైనది. మస్‌జిద్‌కు వెళ్ళలేనివారు ఉన్న స్థలాన్ని శుభ్రం చేసుకొని, ప్రార్థన చేసి భగవంతుడి కృపకు పాత్రులవుతారు. ముస్లింలు రంజాన్‌ ఆఖరు పది రోజులు ఇళ్ళు వదలి మసీదుల్లో ఉంటూ మహాప్రవక్త అల్లాహ్‌ గురించి ప్రార్థనలతో ఆథ్యాత్మిక భావాన్ని అలవర్చుకుంటారు.
దానధర్మాలు
   తాము సంపాదించిన దానిలో పేదవారికి కనీసం నూటికి రూ.2.50పై, గోధుమలు, సేమియా, వస్త్రాలు, బంగారం దానం చేయాలని ఖురాన్‌ చెబుతోంది. రంజాన్‌ నెలలో ఇలా దానం చేస్తే పేద వారు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారని ముస్లిం పెద్దలు చెబుతుంటారు.
ఈదుల్‌ ఫితర్‌
   రంజాన్‌ పండుగను ఈదుర్‌ ఫితర్‌ అని అంటారు. బాలచంద్రుడిని దర్శించిన తరువాతి రోజు ఉదయం పండుగను జరుపుకొంటారు. పండుగ ప్రార్థనలను ఈద్గాలోనే జరుపుతారు. నమాజ్‌ అనంతరం ముస్లింలు, ముస్లిమేతరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్‌ శుభాకాంక్షలను తెలుపుకొంటారు. పండుగ రోజు షీర్‌ ఖుర్మా అనబడే తీయటి సేమియాను తప్పక వండుతారు.
రంజాన్‌ కోసం మసీదుల ముస్తాబు
   రంజాన్‌ మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఆయా ప్రాంతాల్లోని మసీదులను ప్రార్థనల కోసం ప్రత్యేక హంగులతో ముస్తాబు చేస్తారు. మసీదులు నూతన శోభతో ఉపవాస ప్రార్థనల కోసం సిద్ధమవుతాయి. మసీదులకి రంగులు వేయడంతో పాటు విద్యుత్‌ దీపాలంకరణలు, మరమ్మతులు పూర్తి చేస్తారు. అలాగే సహారీ, ఇఫ్తారీల ఏర్పాట్లు కూడా చేస్తారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రత్యేక తారావీహ్‌ నమాజ్‌లను ఆచరించేందుకు మసీదుల్లో ఖురాన్‌ హాఫిజ్‌లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
రంజాన్‌ మాసంలో ప్రత్యేకతలు
   ఈ మాసంలో సహృదయంతో, దైవభక్తితో సత్కార్యం చేసిన వ్యక్తికి ఇతర మాసాల్లో చేసిన ఫరజ్‌కి లభించే పుణ్యఫలం లభిస్తుంది. ఫరజ్‌ని ఆచరిస్తే ఇతర మాసాల్లో లభించే డబ్భై విధులకు సమానమైన పుణ్యఫలాలు ప్రాప్తమవుతాయి.
   దివ్య ఖురాన్‌ ఈ మాసంలోనే అవతరించింది.
   హజరత్‌ దావూద్‌కు ఈ మాసంలోనే జబూర్‌గ్రంథం ఇవ్వబడింది.
   హజరత్‌ జిబ్రాయిల్‌ ప్రతి సంవత్సరం ఈ మాసంలో మహాప్రవక్తకు దివ్య ఖురాన్‌ను సంపూర్ణంగా        వినిపించేవారు.
   రోజా(ఉపవాసదీక్ష) విధిగా నిర్ణయించబడింది.
   రంజాన్‌ మాసం ప్రారంభం కాగానే ప్రత్యేక తారావీహ్‌నమాజ్‌ ఆదేశించబడింది.
   వెయ్యి రాత్రుల కంటే పుణ్యప్రదమైన లైలతుల్‌ఖద్ర్‌’ (షబేఖదర్‌) ఈ మాసంలోనే ఉంది.
   ఆర్థిక ఆరాధన అయిన జకాత్‌చెల్లించడం, నిరుపేదల హక్కు అయిన ఫిత్రాదానం చేయడం దైవ ప్రసన్నత చూరగొనే మౌనవ్రతం పాటించడం ఈ నెలలోనే జరుగుతుంది.
   మహ్మద్‌ ప్రవక్తకు రంజాన్‌ నెలలో ఇరవై వకటవ తేదీన ప్రవక్త పదవి లభించింది.
   మొట్టమొదటి బదర్‌ ధర్మ సంగ్రామం ఈ నెలలోనే జరిగింది.
   నమాజ్‌ దుష్టచింతనల్ని. దురాగతాల్ని, కుహనా సంస్కారాన్ని ఎదుర్కోగలదు. సత్ప్రవర్తనను నేర్పించగలదు. సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న అని చెప్తుంది ఖురాన్‌. 
   నెల రోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ  ప్రతిఫలం ఈ రోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకుని వస్త్రాలు ధరించి సుగంధం పన్నీరు పూసుకుని తక్బీర్‌ పఠిస్తూ ఈద్‌గాహ్‌ చేరుకుంటారు.
   అక్కడ ప్రార్థన చేస్తారు. ఇహ్‌దినస్సిరాత్‌ ముస్తఖీమ్‌ (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరుతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్‌ పూర్తి అయిన తర్వాత అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు.
    ఈద్‌ ముబారక్‌ తెలియజేసుకుంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకుంటారు. విందు ఆరగిస్తారు.
  ఈద్‌విలాప్‌ సమావేశాలు ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు.
   'రంజాన్ లేదా  రమదాన్ (Ramzan, Ramadan) ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం మతస్తులు ఆచరించే ఒక ఉపవాస దీక్షా వ్రతం కేలండర్ లోని మరియు ఇస్లామీయ ఒక ‌నెల పేరు. నెలల క్రమంలో తొమ్మిదవది.
పండుగ, పర్వదినం అంటే శుభవేళ, ఉత్సవ సమయం అని అర్థం.
  పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తూ వున్నాయి. ' పండుగ ' అనేది ఏ మతానికి సంబంధించినదైనా సరే... దాని వెనుక ఒక సందేశం దాగి వుంటుంది. ' పండుగ ' మానావాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే  రంజాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది.
 'వసంతమైనా  శిలలపైన పూదోట పెరగదు. మెత్తటి మన్ను అయితే మనస్సును దోచే రంగురంగుల పూలు పూస్తాయి. బండరాయిగా మారే దిశవైపు ఎవరి గుండె వెళ్తున్నా, దాన్ని మళ్లించి మెత్తటి మన్నుగా మార్చడం పవిత్ర కర్తవ్యం'- అంటారు పెద్దలు.
   ఏడాదికోసారి నెల రోజులు అలాంటి ఉదాత్త భావాల్ని నేర్పిస్తుంది రమజాన్‌ మాసం!
  



No comments:

Post a Comment